Abn logo
Jun 30 2020 @ 03:24AM

రొనాల్డో పెళ్లి త్వరలో?

న్యూఢిల్లీ: పోర్చుగీస్‌ సాకర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తన గాళ్‌ఫ్రెండ్‌ జార్జీనా రోడ్రిగ్స్‌తో ఎన్నో ఏళ్లుగా సహజీవం చేస్తున్నాడు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే, వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ఉహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం.. జార్జీనా తన వేలికి ఉన్న ఓ ఉంగరాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడమే! ఇటలీలో యాచట్‌లో విహరిస్తున్న రొనాల్డో, జార్జియానా కొన్ని ఫొటోలను నెట్‌లో పోస్టు చేశారు. అందులో ఓ ఫొటోలో జార్జీనా చేతి ఉంగరం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. దీంతో అది ఎంగేజ్‌మెంట్‌ రింగే అని.. త్వరలో వీరు వివాహం చేసుకుంటారని అక్కడి మీడియా వెల్లడించింది. జార్జినా కూడా.. ‘నీవు అనే కంటే.. మనం అనడాన్ని ఎక్కువగా ఇష్టపడతా’ అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌ పెట్టడంతో వారి పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. 


Advertisement
Advertisement
Advertisement