జీఎస్‌టీ వసూళ్లు@ రూ.1.16 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-08-02T06:12:00+05:30 IST

జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లకు పడిపోయిన వసూళ్లు జూలై నెలలో రూ.1,16,393 కోట్లకు చేరాయి. గత ఏడాది జూలైలో వసూలైన రూ.87,422 కోట్లతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ.

జీఎస్‌టీ వసూళ్లు@ రూ.1.16 లక్షల కోట్లు

జూలైలో మళ్లీ రూ.లక్ష కోట్ల ఎగువకు

న్యూఢిల్లీ (ఆంధ్రజ్యోతి): జీఎస్‌టీ వసూళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ఏడాది జూన్‌లో రూ.92,849 కోట్లకు పడిపోయిన వసూళ్లు జూలై నెలలో రూ.1,16,393 కోట్లకు చేరాయి. గత ఏడాది జూలైలో వసూలైన రూ.87,422 కోట్లతో పోలిస్తే ఇది 33 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021- 22) ఏప్రిల్‌ తర్వాత ఇదే అత్యధిక జీఎస్‌టీ వసూళ్లని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లుగా ఉన్నాయి. జూలైలో వసూలైన మొత్తం జీఎ్‌సటీలో సీజీఎ్‌సటీ ద్వారా రూ.22,197 కోట్లు, ఎస్‌జీఎ్‌సటీ ద్వారా రూ.28,541 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్‌టీ ద్వారా రూ.57,864 కోట్లు వసూలయ్యాయి. కొవిడ్‌ రెండో ఉధృతి తగ్గి ఆర్థిక కార్యకలాపాలు పుంజుకున్నందున మున్ముందు కూడా జీఎస్‌టీ వసూళ్లు బాగుంటాయని ప్రభుత్వం భావిస్తోంది. 


తెలుగు రాష్ట్రాల్లోనూ అదే జోరు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనూ గత నెల జీఎస్‌టీ వసూళ్లు పుంజుకున్నాయి. ఏపీలో గత ఏడాది జూలైలో రూ.2,138 కోట్లుగా ఉన్న జీఎస్‌టీ వసూళ్లు ఈ ఏడాది అదే నెలలో ఏడు శాతం వృద్ధితో రూ.2,730 కోట్లకు చేరాయి. తెలంగాణలో మాత్రం ఏకంగా 26 శాతం వృద్ధితో రూ.2,876 కోట్ల నుంచి రూ.3,610 కోట్లకు చేరాయి. 


శుద్ధి చేసిన మురికి నీటిపైనా 18@ జీఎస్‌టీ

శుద్ధి చేసిన మురికి  నీటిపై జీఎస్‌టీకి సంబంధించి అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌), మహారాష్ట్ర బెంచ్‌ కీలక తీర్పు ఇచ్చింది. ఇలా శుద్ధి చేసి ఆ నీటిని పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేస్తే దాన్ని.. నీటిగానే పరిగణించి 18 శాతం జీఎస్‌టీ వసూలు చేయవచ్చని స్పష్టం చేసింది. నాగపూర్‌ వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ పిటిషన్‌ను విచారించిన ఏఏఆర్‌ బెంచ్‌ ఈ తీర్పు చెప్పింది. 

Updated Date - 2021-08-02T06:12:00+05:30 IST