ఈ ఆర్ధిక సంవత్సరంలో... రూ. 47 వేల కోట్ల విలువైన ఐఫోన్లు

ABN , First Publish Date - 2022-04-29T22:34:14+05:30 IST

ఆర్థిక సంవత్సరంలో యాపిల్... భారత్‌లో రూ. 47 వేల కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేయగలదని ఓ నివేదిక పేర్కొంది.

ఈ ఆర్ధిక సంవత్సరంలో...  రూ. 47 వేల కోట్ల విలువైన ఐఫోన్లు

హైదరాబాద్ : ఈ ఆర్థిక సంవత్సరంలో యాపిల్... భారత్‌లో రూ. 47 వేల కోట్ల విలువైన ఐఫోన్‌లను తయారు చేయగలదని ఓ నివేదిక పేర్కొంది. భారతదేశంలోని యాపిల్ సంబంధత కాంట్రాక్ట్ తయారీదారులు... 2023 ఆర్ధిక సంవత్సరంలో... రూ. 47 వేల  కోట్ల విలువైన ఐ ఫోన్లను తయారు చేస్తారని  నివేదించింది. కాగా... 222 ఆర్ధిక సంవత్సరంలో భారతదేశంలో ఆపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు ఫాక్స్‌కాన్ మరియు విస్ట్రాన్ తయారు చేసిన రూ. 10 వేల కోట్ల విలువైన ఐఫోన్‌ల కంటే ఇది దాదాపు ఐదు రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో... యాపిల్ యొక్క తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్ భారతదేశంలో ‘ఫోన్ 13’ను తయారీని ప్రారంభించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-04-29T22:34:14+05:30 IST