నిమిషానికి రూ.875 కోట్లు

ABN , First Publish Date - 2021-03-25T06:12:52+05:30 IST

కరోనా రెండో వేవ్‌ విస్తరిస్తోందన్న భయాల కారణంగా ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడంతో స్టాక్‌మార్కెట్‌ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది.

నిమిషానికి రూ.875 కోట్లు

  •  మార్కెట్‌ భారీ పతనంలో ఆవిరైపోయిన సంపద
  •  సెన్సెక్స్‌ 871 పాయింట్లు డౌన్‌ 
  •  నెల రోజుల్లో అతిపెద్ద క్షీణత


ముంబై: కరోనా రెండో వేవ్‌ విస్తరిస్తోందన్న భయాల కారణంగా ఇన్వెస్టర్లు తెగబడి అమ్మకాలు సాగించడంతో స్టాక్‌మార్కెట్‌ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. బుధవారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.3,27,967 కోట్లు క్షీణించి రూ.202.48 లక్షల కోట్లకు పడిపోయింది. అంటే, నిమిషానికి రూ.875 కోట్ల చొప్పున (రూ.3.27 లక్షల కోట్లు/375 నిమిషాలు) హరించుకుపోయింది. గ్లోబల్‌ మార్కెట్ల సంకేతాలు బలహీనంగా ఉండటం ట్రేడింగ్‌లో నైరాశ్యాన్ని మరింత పెంచింది. సెన్సెక్స్‌ 871.13 పాయిం ట్లు క్షీణించి 49,180.31 వద్దకు జారుకుంది. నిఫ్టీ 265.35 పాయింట్లు కోల్పోయి 14,549.40 వద్ద స్థిరపడింది. గత నెల 26 తర్వాత ఇదే అతిపెద్ద నష్టం. 




 సెనెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో ఏషియన్‌ పెయింట్స్‌, పవర్‌గ్రిడ్‌ మినహా మిగతా 28 సంస్థల షేర్లు నేలచూపులు చూశాయి. మహీం ద్రా అండ్‌ మహీంద్రా 3.97 శాతం నష్టంతో టాప్‌ లూజర్‌గా నిలిచింది. 


 ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ 3 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. ఐటీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఆటో, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. 


 బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ సూచీలు 1.60 శాతం చొప్పున నష్టపోగా.. లార్జ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.79 శాతం పతనమైంది. రంగాలవారీగా చూస్తే, రియల్టీ, మెటల్‌, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, ఆటో, క్యాపిటల్‌గూడ్స్‌ సూచీలు  నష్టపోయాయి. 


 అమెరికన్‌ డాలర్‌తో రూపాయి మారకం రేటు 12 పైసలు బలహీనపడి 72.55 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్ల పతనంతోపాటు అంతర్జాతీయ మార్కె ట్లో ముడి చమురు ధరలు పెరుగదల ఇందుకు కారణమైంది. 


 భారత కాలమాన ప్రకారం, బుధవారం రాత్రి 7 గంటల నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 62.63 డాలర్ల వద్ద ట్రేడైంది. 




మరిన్ని విషయాలు


 అనుపమ్‌ రసాయన్‌ షేరు లిస్టింగ్‌ రోజునే నిరాశను మిగిల్చింది. బీఎ్‌సఈలో 6 శాతం తగ్గి రూ.525.90 వద్దకు జారుకుంది. 


 బార్బిక్యూ నేషన్‌ ఐపీఓకు మంచి స్పందన లభించింది. ఇష్యూ తొలిరోజునే 1.33 రెట్ల బిడ్లు వచ్చాయి. రూ.453 కోట్ల సేకరణ లక్ష్యం. 


 రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.1,283.65 కోట్ల వరకు సమీకరించేందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్ట


మెంట్‌ ట్రస్ట్‌ (ఇన్వ్‌ఐటీ) ‘ఇండిగ్రిడ్‌’ ఇన్వె్‌స్టమెంట్‌ మే నేజర్స్‌ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ ట్రస్ట్‌ ఇష్యూ ఏప్రిల్‌ 6న ప్రారంభమై 13న ముగియనుంది. ఇష్యూ యూనిట్‌ ధరను రూ.110గా నిర్ణయించింది. 


 బాండ్ల జారీ ద్వారా రూ.670 కోట్లు సమీకరించినట్లు ఐఐఎ్‌ఫఎల్‌ ఫైనాన్స్‌ వెల్లడించింది. 


Updated Date - 2021-03-25T06:12:52+05:30 IST