11ఏళ్ల క్రితం.. సచిన్ సూపర్ రికార్డు!

ABN , First Publish Date - 2020-11-22T02:02:30+05:30 IST

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు. వాటిలో 11ఏళ్ల క్రితం నవంబరు 20న ఓ అసామాన్యమైన రికార్డును చేరుకున్నాడు.

11ఏళ్ల క్రితం.. సచిన్ సూపర్ రికార్డు!

ఇంటర్నెట్ డెస్క్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తన క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లను అందుకున్నాడు. వాటిలో 11ఏళ్ల క్రితం నవంబరు 20న ఓ అసామాన్యమైన రికార్డును చేరుకున్నాడు. అదేంటో తెలుసా? అహ్మదాబాద్‌లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచులో సచిన్ ఈ రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచులో సెంచరీ చేశాడు. అది సచిన్ కెరీర్‌లో 88వ సెంచరీ. అంతేకాదండోయ్ ఈ మ్యాచులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో 30వేల పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. మొత్తమ్మీద సచిన్ తన కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 100 సెంచరీలు నమోదు చేశాడు. ఇది ఇప్పటికీ రికార్డే.


 అలాగే రిటైర్ అయ్యేనాటికి 34,357 పరుగులు చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. వీటిలో వన్డేల్లో 18,426 పరుగులు, టెస్టుల్లో 15,291 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఉన్న శ్రీలంక దిగ్గజం సంగక్కర కన్నా సచిన్ 4వేలపైగా పరుగులు అధికంగా చేయడం గమనార్హం. అలాగే 24ఏళ్లపాటు క్రికెట్ ఆడిన సచిన్.. కేవలం ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడాడు.

Updated Date - 2020-11-22T02:02:30+05:30 IST