Advertisement
Advertisement
Abn logo
Advertisement

మహిళలకు సేఫ్టీ జాకెట్‌.. ఆవిష్కరించిన కవిత

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): సమాజంలో మహిళలకు భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. మహిళల రక్షణ కోసం హైదరాబాద్‌ యువకులు రూపొందించిన ‘అభయ కోట్‌’ అనే ప్రత్యేక సేఫ్టీ జాకెట్‌ను ఆమె శుక్రవారం ఆవిష్కరించారు. దివ్యాంగ మహిళల రక్షణ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించిన యువకులు దినేశ్‌, శశాంక్‌రెడ్డి, దినేశ్‌రెడ్డిని కవిత అభినందించారు. కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్యే గణేశ్‌ బిగాల, ఎమ్మెల్సీ దయానంద్‌, పోలీస్‌ హౌసింగ్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌, ఐడీసీ చైర్మన్‌ అమరవాది లక్ష్మీనారాయణ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement
Advertisement