కమిషన్లకు మోక్షం ఎప్పుడు!

ABN , First Publish Date - 2021-08-03T22:33:17+05:30 IST

వివిధ సామాజిక వర్గాలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిషన్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.

కమిషన్లకు మోక్షం ఎప్పుడు!

హైదరాబాద్: వివిధ సామాజిక వర్గాలకు తోడ్పాటు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధ కమిషన్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. కొత్త చైర్మన్ లేకపోవడంతో ఆయా వర్గాల ఇబ్బందులు, బాధలను వినే వారు కరువయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అప్పటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి రాజీనామా చేశారు. దాదాపు మూడేళ్ల పాటు ఖాళీగా ఉన్న పదవిని జూలై 23న హుజురాబాద్‌కు చెందిన బండ శ్రీనివాస్ నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం బీసీ కమిషన్‌ను 2016 అక్టోబర్‌లో ఏర్పాటు చేసింది. మూడేళ్లపాటు సాగిన ఈ కమిషన్ గడువు 2019 అక్టోబర్ పూర్తయింది. అదే విధంగా 2018 ఫిబ్రవరిలో ఏర్పాటైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరితో 18తో ముగిసింది. ఎస్టీ, ఎస్టీ కమిషన్‌కు ఎక్కువగా అట్రాసిటీకి సంబంధించిన ఫిర్యాదులు వస్తుంటాయి. ఇది వరకున్న కమిషను మూడేళ్ల కాలంలో వేలాది ఫిర్యాదులు వచ్చాయి. ప్రస్తుతం ఐదు నెలలుగా కమిషన్ ఖాళీ కావడంతో ఫిర్యాదులపై గందరగోళం నేలకొంది. వీటితోపాటు బీసీ సమాజంలో దాదాపు 30 రకాల కులాలకు గుర్తింపు లేదు. ఇందులో కేవలం 18 కులాలకు మాత్రమే ప్రభుత్వం అప్పుడప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరిస్తుంది.

Updated Date - 2021-08-03T22:33:17+05:30 IST