శాంసంగ్ కొత్త ఫోన్... బ్యాటరీ బ్యాకప్... 7,000 ఎంఏహెచ్...

ABN , First Publish Date - 2021-01-18T00:32:52+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇష్టపడే దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లకు ధీటుగా పెద్ద మొత్తంలో బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది.

శాంసంగ్ కొత్త ఫోన్... బ్యాటరీ బ్యాకప్... 7,000 ఎంఏహెచ్...

సువాన్‌సి(దక్షిణ కొరియా) : ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులు ఇష్టపడే  దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తోంది. ఇతర కంపెనీలకు చెందిన ఫోన్లకు ధీటుగా పెద్ద మొత్తంలో బ్యాటరీ బ్యాకప్ కలిగిన ఈ ఫోన్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి రానుంది. శాంసంగ్ కంపెనీ ఈ వివరాలను ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ ఎం62 పేరుతో విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. గెలాక్సీ ఎం51 ఫోన్‌కు తర్వాతి వెర్షన్‌గా వస్తోన్న ఈ ఫోన్‌... స్పీడ్‌గా ఛార్జ్ అయ్యేలా 25 వాట్స్‌తో చార్జర్ కూడా అందించనున్నారు. ఈ ఫోన్ ధర రూ. 23 నుంచి 25 వేల వరకు ఉండవచ్చని సమాచారం.


గెలాక్సీ ఎం62 ఫోన్ ఫీచర్లు ఇవీ... 

రిసొల్యూషన్: 1080 x 2400, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ,

ఫ్రంట్ కెమెరా: 64 ఎంపీ +1.8+12+2.2+5+2.4,

రేర్ కెమెరా: 64 ఎంపీ + 12 ఎంపీ + 5 ఎంపీ + 5 ఎంపీ

4జీ ఎల్‌టీఈ,

డ్యూయల్ బ్యాండ్ వై-ఫై,

ఎన్ఎఫ్‌సీ సపోర్ట్,

6 జీవీ ర్యామ్, 256 జీవీ ఇంటర్నల్ స్టోరేజీ,

ఆండ్రాయిడ్ 11,

ఎక్స్‌నోస్ 9825 ప్రాసెసర్‌. 

Updated Date - 2021-01-18T00:32:52+05:30 IST