నెల్లూరు జిల్లాలో ఇసుక వివాదం

ABN , First Publish Date - 2020-06-04T20:21:11+05:30 IST

సూళ్లూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం ఇసుర రీచ్ వివాదాస్పదంగా మారింది.

నెల్లూరు జిల్లాలో ఇసుక వివాదం

నెల్లూరు జిల్లా: సూళ్లూరుపేట మండలంలోని ముదివర్తిపాలెం ఇసుక రీచ్ వివాదాస్పదంగా మారింది. రీచ్ వల్ల భూగర్భజలాలు ఉప్పు నీరుగా మారిపోతున్నాయి. రీచ్ ఉన్న ప్రాంతం నుంచే ఐదు గ్రామాలకు తాగునీరు అందుతోంది. ఇసుక తవ్వకాలవల్ల ఊళ్లన్నీ ఉప్పునీటి మయంగా మారే పరిస్థితి ఏర్పడింది. 2012లోనే రీచ్ నిర్వహించవద్దని లోకాయుక్త ఆదేశాలిచ్చింది. అయినా ఇటీవల పోలీస్ ప్రొటెక్షన్‌తో రీచ్ తెరిచారు. దీనిపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

Updated Date - 2020-06-04T20:21:11+05:30 IST