Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 31 2021 @ 20:39PM

పోలీసులపై ఇసుక మాఫియా దాడి

జగిత్యాల: జిల్లాలో ఇసుక మాఫియా చెలరేగి పోయింది. ఏకంగా పోలీసుల పైనే దాడి చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మల్లాపూర్ (మ) వేంపల్లి వాగు వద్ద నాలుగు రోజుల క్రితం పోలీసులపై ఇసుక మాఫియా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో కొత్తపేట ఒడ్డెర కాలనీకి చెందిన 18 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement