స్పెల్లింగ్‌ బీలో తెలుగు సంతతి చిన్నారుల ప్రతిభ

ABN , First Publish Date - 2021-07-10T13:39:12+05:30 IST

ఏ దేశమేగినా.. భారత అమెరికన్లు కీర్తిపతాకను ఎగరేస్తున్నారు. ప్రపంచస్థాయి పోటీలైనా.. కీలక పదవులైనా తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా 2021 స్ర్కిప్స్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన చిన్నారులు 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో తొలిసారి ఆఫ్రో-అమెరికన్‌ జైలా అవంత్‌గార్డే(14) విజేతగా నిలిచారు.

స్పెల్లింగ్‌ బీలో తెలుగు సంతతి చిన్నారుల ప్రతిభ

2, 3 స్థానాల్లో చైత్ర, భావన

వాషింగ్టన్‌, జూలై 9 : ఏ దేశమేగినా.. భారత అమెరికన్లు కీర్తిపతాకను ఎగరేస్తున్నారు. ప్రపంచస్థాయి పోటీలైనా..  కీలక పదవులైనా తమ ప్రతిభను చాటుతున్నారు. తాజాగా 2021 స్ర్కిప్స్‌ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో తెలుగు సంతతికి చెందిన చిన్నారులు 2, 3 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక పోటీల్లో తొలిసారి ఆఫ్రో-అమెరికన్‌ జైలా అవంత్‌గార్డే(14) విజేతగా నిలిచారు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన చైత్ర తుమ్మల(12), న్యూయార్క్‌కు చెందిన భావన మాదిని(13) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.


ఫైనల్స్‌కు మొత్తం 11 మంది పోటీపడ్డారు. విజేతలను అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌ అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన చైత్రకు సంగీతమంటే మక్కువ. సైన్స్‌ ఒలింపియాడ్‌, మ్యాథ్‌ ఒలింపియాడ్‌ అవార్డులను గెలుచుకుంది. ప్లెయిన్‌వ్యూ ఓల్డ్‌ బెథ్‌పేజ్‌ మిడిల్‌ స్కూల్‌లో చదువుతున్న భావనకు పుస్తక పఠనమంటే అమితాసక్తి. చైత్ర, భావన ఇద్దరూ 2019 స్పెల్లింగ్‌ బీ పోటీల్లో పోటీపడటం విశేషం.  

Updated Date - 2021-07-10T13:39:12+05:30 IST