మేమేం చేశాం పాపం?

ABN , First Publish Date - 2021-09-18T06:01:27+05:30 IST

మేమేం చేశాం పాపం?

మేమేం చేశాం పాపం?

దళితుల రుణాల సబ్సిడీలో గ్రామీణ, పట్టణ వివక్ష

గ్రామీణంలో 422మందికి చెక్కులు సిద్ధం

అర్బన్‌లో 138మందికి మంజూరవని సబ్సిడీ

ఆందోళన చెందుతున్న అర్బన్‌ ప్రాంత లబ్ధిదారులు 

ఖమ్మంసంక్షేమవిభాగం, సెప్టెంబరు 17: నిరుపేదలైన ఎస్సీ కులాలకు చెందిన చిరు వ్యాపారులకు ఎలాంటి షరతులు లేకుండా నూరుశాతం రుణమాఫీతో రాష్ట్ర ప్రభుత్వం 2017లో ‘పెట్టి’ పేరుతో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. తొలుత షెడ్యూల్డ్‌ సహకార సంఘం అధ్వర్యంలోని ఎస్సీ కులాల వారికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రకటించింది. 2018-19 సంవత్సరంలో ఈ పెట్టి పథకానికి జిల్లాలో నోటిఫికేషన్‌ విడుదల చేసి లబ్ధిదారులతో దరఖాస్తులను స్వీకరించారు. ఈ క్రమంలో గతంలో రుణాలకు దరఖాస్తులు చేసి అర్హత కలిగిన వారిని సైతం గుర్తించారు. ఇలా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11వేల మంది వరకు పెట్టి పథకానికి దరఖాస్తులు అర్హత సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నా లబ్ధిదారుల ఎంపిక పకడ్బందీగా జరిగేలా అధికారులు కార్యచరణ చేపట్టినా సబ్సిడీ మంజూరులో మాత్రం వివక్ష ఏర్పడింది. గ్రామీణ ప్రాంతంలోని దళిత లబ్ధిదారులకు చెక్కులు అందించేందుకు ఓ వైపు అధికారులు ఏర్పాట్తు చేస్తున్నారు. కానీ ఆదే పథకంలో తమకెందుకు అర్హత రాలేదని ఖమ్మం అర్బన్‌ ప్రాంతంలోని లబ్ధిదారులు లబ్దిదారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో నిత్యం పంచాయతీలతో  ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 

‘పెట్టి’ పథకంలో పేచీ..

ఖమ్మంఖమ్మం జిల్లా వ్యాప్తంగా 11వేల మంది వరకు దరఖాస్తులు చేయగా వారిలో గ్రామీణ ప్రాంతంలోని ఎస్సీ కులాల దరఖాస్తుదారులను స్థానిక ఎంపీడీవోలు, అర్బన్‌ ప్రాంతంలోని లబ్ధిదారులను పురపాలక అధికారులు పరిశీలన చేశారు. లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వారిని లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా ‘పెట్టి’ పథకానికి 560 మందిని గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ క్రమంలో గత వారం పెట్టి పథకానికి నూరుశాతం సబ్బడీ మంజూరు జరిగింది. మండలాల వారికి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ప్రభుత్వం సబ్సిడీలను విడుదల చేసింది. అయితే ఇక్కడే సరిగ్గా పేచీ వచ్చి పడింది. పెట్టి పథకానికి గ్రామీణ ప్రాంతంలో 422మంది, ఖమ్మం అర్బన్‌లో 138 మందిని ప్రభుత్వం ఎంపిక చేయగా కేవలం గ్రామీణ ప్రాంతంలోని 422 మందికే ప్రభుత్వం సబ్సడీలను విడుదల చేసింది. కాని ఒకే నోటిఫికేషన్‌ ద్వారా ఎంపిక జరిగిన అర్బన్‌ ప్రాంత లబ్ధిదారులకు మాత్రం సబ్సిడీ మంజూరు కాలేదు. దీంతో అర్బన్‌ ప్రాంత లబ్ధిదారులు నిత్యం ఎస్సీ కార్పొరేషన్‌ అధికారుల వద్ద వాదనకు దిగుతున్నారు. గతంలో ఇలాంటి విధంగా ఏ రుణాలకు జరగలేదని అసలు మంజూరు జరుగుతాయా? లేదా? అని ఖమ్మం నగరానికి చెందిన లబ్ధిదారుడు విజయ్‌ ఎస్సీ వెల్ఫేర్‌ ఈడీ కస్తాల సత్యనారాయణతో గురువారం కార్యాలయంలో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.

ఒకే పథకంలోని వారికి ఒకే సారి సబ్సిడీ ఇవ్వాలి..

నందిపాటి మనోహర్‌, కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఖమ్మం జిల్లా కార్యదర్శి

ఒక పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి అమలు చేసి ఒకే సారి లబ్ధిదారులకు సబ్సిడీ లను విడుదల చేయాలి. కానీ ఒకే జిల్లాలోని ఒకే పథకంలోని లబ్ధిదారులను గ్రామీణం, పట్ట ణ ప్రాంతాలుగా విభజన చేసి సబ్సిడీలు మంజూరు చేయటం అన్యాయం. పట్టణ ప్రాం తంలో సబ్సిడీలు రాని లబ్ధిదారుల తరుపున కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తరుపున పోరాటం చేస్తాం.

సబ్సిడీ ప్రభుత్వం చేతిలో ఉంది

కస్తాల సత్యనారాయణ, ఈడీ

2018-19 పెట్టి పథకంలో జిల్లా వ్యాప్తంగా 560 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని 422 మంది లబ్ధిదారులకు సబ్సిడీ మంజూరు చేయటంతో వారికి చెక్కులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. పట్టణ ప్రాంతంలోని వారికి సబ్సిడీ ఇంకా మంజూరు కాలేదు. మరో వారం పది రోజులు పట్టే అవకాశంఉంది. ప్రభుత్వం సబ్సిడీ మం జూరు చేస్తే లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్‌ కార్యాచరణ చేస్తాం.

Updated Date - 2021-09-18T06:01:27+05:30 IST