Advertisement
Advertisement
Abn logo
Advertisement

తిరుపతి 7వ వార్డు ఎన్నికల ప్రక్రియను సస్పెండ్ చేసిన ఎస్‌ఈసీ

అమరావతి: తిరుపతి 7వ వార్డు ఎన్నికల ప్రక్రియను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ సస్పెండ్ చేశారు. 7వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్ విత్‌డ్రా వ్యవహారంపై ఎస్‌ఈసీ సీరియస్ అయింది. పోలీసులు, ఎన్నికల అధికారులకు 7వ వార్డు అభ్యర్థి విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. గురువారం నిమ్మగడ్డ మీడియాతో మాట్లాడుతూ ఇది ఎన్నికల నేరంగా పరిగణిస్తున్నామని ప్రకటించారు. ప్రాథమిక సాక్ష్యాధారాలున్నాయని, విచారణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు. విచారణ పూర్తయిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటామని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపాలిటీల్లోనూ వీలైనన్ని ఎక్కువ డివిజన్లను ఏకగీవ్రం చేసుకోవాలని వైసీపీ నేతలు ఎత్తులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే టీడీపీ సహా ఇతర ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను బెదిరించి, ప్రలోభ పెడుతున్నారు. 

Advertisement
Advertisement