గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-10T14:34:16+05:30 IST

గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు లావినియో రెబెల్లో కన్నుమూశారు.....

గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడి కన్నుమూత

పనాజీ (గోవా): గోవా ఫుట్‌బాల్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షుడు లావినియో రెబెల్లో కన్నుమూశారు. ఆల్ ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్, బీచ్ సోకర్ కమిటీల్లోనూ డిప్యూటీ ఛైర్ పర్సన్ అయిన రెబెల్లో మృతి ఫుట్ బాల్ క్రీడల రంగానికి తీరని లోటని ఆల్ ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కౌశల్ దాస్ చెప్పారు. ఫుట్ బాల్ ప్రేమికుడైన రెబెల్లో ఆయన క్రీడల అభివృద్ధికి చేసిన సేవలు మర్చిపోలేమని ఆల్ ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రపుల్ పటేల్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

Updated Date - 2021-05-10T14:34:16+05:30 IST