కరోనాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2021-05-08T05:33:19+05:30 IST

కరోనాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడుగురి మృతి

కరోనాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడుగురి మృతి

 రంగారెడ్డి : కరోనాతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో శుక్రవారం ఏడుగురి మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లాలో.. ధారూరు మండలం మోమిన్‌కలాన్‌ గ్రామంలో ఓ మహిళ(40)కు కరోనా సోకగా తాండూర్‌ ప్రభుత్వ అసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. పరిగి మండల కేంద్రంలో ఓ వ్యక్తికి(40) ఏప్రిల్‌ 26న కరోనా పాజిటివ్‌గా వచ్చింది. చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కాగా అతడు వృత్తిరీత్యా వ్యాపారి. అలాగే తాండూరు, బొంరాస్‌పేట, పెద్దేముల్‌ మండల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. కాగా రంగారెడ్డి జిల్లాలో.. షాబాద్‌ మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన సర్దార్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌కు గత 15 రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా తేలింది. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. షాద్‌నగర్‌ మండల కేంద్రానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ కరోనా బారినపడి మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం కరోనాకు గురి కావడంతో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్ప్రతిలో చికిత్స పొందుతున్నాడు. ఊపిరితిత్తులు, మెదడు సంబంధిత సమస్యలు ఎదురుకావడంతో ఆయన పరిస్థితి విషమించడంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు వివరించారు. కరోనాతో శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలో అయిదుగురు మృతి చెందగా, కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి. 1491 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిలో 461 మందిని కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాండూరులో 74 కరోనా కేసులు నమోదు కాగా,  దౌల్తాబాద్‌లో 37, పరిగిలో 35, బొంరాస్‌పేట్‌లో 26, పట్లూర్‌లో 25, సిద్దులూరులో 25, అంగడి రాయిచూర్‌లో 20, కులకచర్లలో 19,  కొడంగల్‌లో 19, నవాల్గలో 16, ధారూరులో 14, చెన్‌గోముల్‌లో 14, మర్పల్లిలో 13, యాలాల్‌లో 13, నవాబ్‌పేట్‌లో 13, వికారాబాద్‌లో 12, రామయ్యగూడలో 12, బంట్వారంలో 12, జిన్‌గుర్తిలో 11, మోమిన్‌పేట్‌లో 10, చిట్యాలలో 9, నాగసమందర్‌లో 9, పెద్దేముల్‌లో 8, బషీరాబాద్‌లో 7, పూడూరులో 6, కోట్‌పల్లిలో 2 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో కేసుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.

Updated Date - 2021-05-08T05:33:19+05:30 IST