Abn logo
Sep 13 2021 @ 00:24AM

శివసాగర్‌ సాహిత్యంపై జాతీయ సదస్సు

అడుగు సామాజిక చైతన్య వేదిక, ప్రొగ్రెసివ్‌ థింకర్స్‌ అసోసియేషన్‌, అంసా సంయుక్త ఆధ్వ ర్యంలో సెప్టెంబరు 15 సా.6గం.లకు జూమ్‌ వేదికగా ‘శివసాగర్‌ సాహిత్యం - సమాలోచన’ అంశంపై జాతీయ స్థాయి అంతర్జాల సదస్సు జరుగుతుంది. ముఖ్య అతిథిగా శిఖామణి, ప్రధాన వక్తగా కె. శ్రీనివాస్‌, విశిష్ట అతిథిగా సుజాతగిడ్ల, గౌరవ అతిథిగా పి. కేశవకుమార్‌, ఆత్మీయ అతిథులుగా జంగా గౌతమ్‌, డా. గుర్రం సీతారాములు పాల్గొంటారు. అధ్యక్షుడు కోయి కోటేశ్వరరావు. వివరాలకు: 9491991918.

కె. శశిధర్‌