న్యూజిలాండ్‌పై విరుచుకుపడిన షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది

ABN , First Publish Date - 2021-09-17T23:40:11+05:30 IST

వైట్‌బాల్ సిరీస్‌ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు

న్యూజిలాండ్‌పై విరుచుకుపడిన షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిది

రావల్పిండి: వైట్‌బాల్ సిరీస్‌ కోసం 18 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్‌లో అడుగుపెట్టిన న్యూజిలాండ్ జట్టు తొలి వన్డేకు కొన్ని నిమిషాల ముందు భద్రతా కారణాల రీత్యా మొత్తం సిరీస్‌ను రద్దు చేసుకోవడం సంచలనమైంది. న్యూజిలాండ్ భద్రతాధికారుల నుంచి అందిన ఆదేశాలతో కివీస్ క్రికెటర్లు హోటల్ రూముల నుంచి బయటకు రాలేదు. ప్రస్తుతం తిరిగి స్వదేశం వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


భద్రతా కారణాలను చూపి కివీస్ జట్టు సిరీస్‌ను రద్దు చేసుకోవడంపై పాక్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, షోయబ్ అక్తర్ తీవ్రంగా స్పందించారు. సెక్యూరిటీ హెచ్చరిక లేదు, ఏమీ లేదని, అదంతా ఉత్తిదేనని అఫ్రిది కొట్టిపడేశాడు. హామీ ఇచ్చినా సిరీస్‌ను రద్దు చేసుకోవడం దారుణమని పేర్కొన్నాడు. మీ నిర్ణయం ప్రభావం ఎంతలా ఉంటుందో తెలుసా? అని ప్రశ్నించాడు. న్యూజిలాండ్ సిరీస్ రద్దు చేసుకోవడంపై షోయబ్ అక్తర్ కూడా ఘాటుగానే స్పందించాడు.  ‘పాక్ క్రికెట్‌ను న్యూజిలాండ్ చంపేసింది’ అని కోపంగా ఉన్న ఎమోజీలతో ట్వీట్ చేశాడు. 

Updated Date - 2021-09-17T23:40:11+05:30 IST