భారతీయ మహిళలను పెళ్లాడిన Foreign cricketers
ABN , First Publish Date - 2021-12-13T17:15:57+05:30 IST
ప్రముఖ విదేశీ క్రికెటర్లు ముత్తయ్య మురళీధరన్ నుంచి షోయబ్ మాలిక్ దాకా పలువురు భారతీయ మహిళలను పెళ్లాడారు....
ముత్తయ్య మురళీధరన్ నుంచి షోయబ్ మాలిక్ దాకా...
న్యూఢిల్లీ: ప్రముఖ విదేశీ క్రికెటర్లు ముత్తయ్య మురళీధరన్ నుంచి షోయబ్ మాలిక్ దాకా పలువురు భారతీయ మహిళలను పెళ్లాడారు. పాక్ దేశ క్రికెటర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను వివాహం చేసుకున్నారు. ఇలా పలు దశాబ్దాలుగా విదేశీ క్రికెటర్లు భారత మహిళలను వివాహమాడారు. ఇంగ్లండ్ కెప్టెన్ మైక్ బ్రెర్లీ నుంచి శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ వరకు భారతీయ మహిళలను పెళ్లాడారు. భారతీయ మహిళలను పెళ్లాడిన విదేశీ క్రికెటర్లు సుఖసంతోషాలతో జీవితం గడుపుతున్నారు. భారతీయ మహిళలను వివాహమాడిన విదేశీ క్రికెటర్ల కథాకమామీషును తెలుసుకుందాం రండి....
1.షోయబ్ మాలిక్, సానియా మీర్జా దంపతులు
పాకిస్థాన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ భారత టెన్నిస్ స్టార్ అయిన సానియా మీర్జాను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇజాన్ అనే కుమారుడు ఉన్నాడు.షోయబ్ మాలిక్, సానియామీర్జాల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.
2.షాన్ టైట్,మషూన్ సింఘాల మధ్య చిగురించిన ప్రేమ
ఆస్ట్రేలియా మాజీ పేస్‌మెన్ షాన్ టైట్ భారత మోడల్ మషూన్ సింఘాను పెళ్లాడారు. ఈ జంట ఐపీఎల్ తర్వాత పార్టీలో కలుసుకున్నారని సమాచారం.ఐపీఎల్ పార్టీలో కలిసిన ఈ జంట మధ్య ప్రేమ చిగురించడంతో వారు ఒకింటి వారయ్యారు.
5.హసన్ అలీ, సమియా అర్జూల వివాహం
పాకిస్థాన్ పేస్ బౌలర్ హసన్ అలీ భారతదేశంలోని హర్యానాలోని ఫరీదాబాద్‌కు చెందిన సమియా అర్జూను వివాహం చేసుకున్నాడు.
3.ముత్తయ్య మురళీధరన్,మద్దిమలర్ రామ్మూర్తి జంట
శ్రీలంక స్పిన్ బౌలింగ్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ భారతదేశానికి చెందిన మద్దిమలర్ రామ్మూర్తిని వివాహమాడారు.చెన్నైలో జన్మించిన మద్దిమలర్ రామమూర్తి మార్చి 2005వ సంవత్సరంలో ముత్తయ్య మురళీధరన్ ను వివాహం చేసుకున్నారు.
4.మైక్ బ్రెర్లీ, మనా సారాభాయ్ దంపతులు
ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, కెప్టెన్ మైక్ బ్రేర్లీ అహ్మదాబాద్‌లో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్త గౌతమ్ సారాభాయ్ కుమార్తె మనా సారాభాయ్‌ను వివాహం చేసుకున్నారు. 1976/77లో ఇంగ్లండ్ భారత పర్యటన సందర్భంగా మైక్ బ్రేర్లీ మనాను కలిశాడు.మైక్ బ్రెర్లీ, సారాభాయ్‌ల మనసులు కలవడంతో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.