విశాఖ: పిల్లల అక్రమరవాణాలో షాకింగ్‌ నిజాలు

ABN , First Publish Date - 2020-08-11T19:30:06+05:30 IST

నగరంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి కేంద్రంగా జరిగిన చిన్నారుల అక్రమ రవాణా కేసులో..

విశాఖ: పిల్లల అక్రమరవాణాలో షాకింగ్‌ నిజాలు

విశాఖ: నగరంలో యూనివర్సల్ సృష్టి ఆస్పత్రి కేంద్రంగా జరిగిన చిన్నారుల అక్రమ రవాణా కేసులో విచారణ కొనసాగుతున్నకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. 63 మంది బిడ్డలు, 8 మంది నిందితులు, ఐదు రోజుల విచారణ.. ఎన్నో మలుపులు.. ఇది పసిపిల్లల అక్రమరవాణా కేసుకు సంబంధించి జరిగిన తతంగం. సరోగసి పేరుతో ఆస్పత్రి సృష్టి అక్రమంగా డబ్బులు సంపాదించి చివరికి ఎందరో తల్లులకు గర్భశోకం మిగిల్చి .. తమ బిడ్డలనే చూసుకోలేని దుస్థితికి డాక్టర్లు తెచ్చుకున్నారు.


ఈ కేసులో కీలక నిందితురాలైన డాక్టర్ నమ్రత పోలీసు కస్టడీ మంగళవారంతో ముగిసింది. ఆమెను ఐదు రోజులు విచారించిన పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. నమ్రతోపాటు ఏజంట్ రామకృష్ణ, డాక్టర్ తిరుమలను మూడు రోజులపాటు విచారించారు. వైద్య పరీక్షల నిమిత్తం నమ్రత, తిరుమలను కేజీహెచ్‌కు తరలించారు. విచారణలో భాగంగా తమ తప్పేమీలేదని, అంతా ఆస్పత్రి సిబ్బందే చేసినట్లుగా డాక్టర్ నమ్రత పోలీసులకు తెలిపారు. పిల్లల విక్రయం కేసులో కీలకంగా వ్యవహరించిన ఆస్పత్రి వాచ్‌మెన్ రామకృష్ణ, డాక్టర్ తిరుమల నుంచి పోలీసులు విచారణ చేపట్టి కీలక సమాచారాన్ని రాబట్టారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా ఎంత మంది పిల్లల అక్రమ రవాణా జరిగింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2020-08-11T19:30:06+05:30 IST