అజర్‌కు షోకాజ్ నోటీసు
ABN , First Publish Date - 2021-06-17T09:26:30+05:30 IST
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అజరుద్దీన్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. రెండు నెలల కిందట అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు అజర్ షోకాజ్ నోటీసు ఇస్తే..తాజాగా కౌన్సిల్.. అధ్యక్షుడికి షోకాజ్ జారీ చేసింది. అంతేకాదు అతడి హెచ్‌సీఏ సభ్య త్వాన్ని సస్పెండ్ చేసింది. అజర్‌పై కౌన్సిల్ వివిధ ఆరోపణలు చేస్తూ వాటికి బదులివ్వాలని సూచించింది. వారంలోపు వాటికి వివరణ ఇవ్వా లని లేదంటే అపెక్స్ కౌన్సిల్ అతడిపై చర్య తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు. ఈమేరకు కార్యదర్శి విజయానంద్ నోటీసు జారీ చేశారు.