సైబీరియా కొంగల సందడి.. విదేశీ అతిథులతో చింతపల్లిలో కోలాహలం

ABN , First Publish Date - 2021-02-22T05:21:54+05:30 IST

సైబీరియా కొంగల సందడి.. విదేశీ అతిథులతో చింతపల్లిలో కోలాహలం

సైబీరియా కొంగల సందడి.. విదేశీ అతిథులతో చింతపల్లిలో కోలాహలం

మన ఇంటికి చుట్టాలొస్తే..? ఇళ్లంతా బంధువులతో నిండిపోతే..?? వాళ్లున్నన్ని రోజులూ మాటలు, ముచ్చట్లతో ఒకటే హంగామా కదూ.. అలాంటిది, ఊరు మొత్తానికీ అతిథులొస్తే..?! ఒకటీ రెండు కాదు.. ఆర్నెల్లపాటు విడిది చేస్తే..?!! వారిని చూసేందుకు మరికొందరు వచ్చిపోతూ ఉంటే..?!!! ఆ వాతావరణం ఎలా ఉంటుంది..? ఆ సందడి అదుర్స్‌ కదూ.. ఖమ్మం జిల్లా రూరల్‌ మండలంలోని చింతపల్లి గ్రామం ఇదేవిధంగా కళకళలాడుతోంది. సుదూరం నుంచి ఏడాదికోసారి వచ్చి స్థానికులను ‘పలకరించి’పోయే విదేశీ అతిథులు విచ్చేశారు. ఇక, ఆర్నెల్లపాటు చుట్టాలతో ఊళ్లో సందడే సందడి...

Updated Date - 2021-02-22T05:21:54+05:30 IST