Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 27 2021 @ 19:02PM

పోలీసుల అదుపులో సిద్దిపేట హెడ్ కానిస్టేబుల్

సిద్దిపేట: నిరుద్యోగులను మోసం చేసిన కేసులో సిద్దిపేట హెడ్ కానిస్టేబుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కామారెడ్డిలో నకిలీ డీఎస్పీ అవతారమెత్తి అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు దోచుకున్న స్వామితో  హెడ్ కానిస్టేబుల్‌‌కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నకిలీ డీఎస్పీతో చేతులు కలిపి సిద్దిపేటలో పలువురు నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ, ఇతర శాఖలలో ఉద్యోగాలిప్పిస్తామని డబ్బులు దండుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. సదరు హెడ్ కానిస్టేబుల్‌ను సిద్దిపేట టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది. 

Advertisement
Advertisement