Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రైతులకు సింహపురీయుల నీరాజనం

నెల్లూరు: అమరావతి రాజధాని కోసం న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర ప్రారంభించిన రాజధాని రైతులకు నెల్లూరు జిల్లాలో అడుగడుగునా అఖండ స్వాగతం లభిస్తోంది. రాజధాని సాధన కోసం పాద యాత్ర చేస్తున్న మహిళా రైతులను అడుగడుగునా చీర సారెలతో సత్కరించారు. కోవూరు శివాలయంలో రాజధాని మహిళా రైతులు లక్ష దీపార్చన చేశారు. ఉదయం 8 గంటలకు కొడవలూరు మండలం నార్తురాజుపాళెం వద్ద కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి  స్వాగతించి యాత్ర ప్రారంభించారు. అక్కడ నుంచి కోవూరుకు చేరుకున్న అమరావతి రైతులకు అడుగుగునా నీరాజనాలు పలికారు. పట్టణంలోని ఐదు కిలోమీటర్ల  పొడవునా ప్రజలు రాజధాని రైతులకు బ్రహ్మరథం పట్టారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. మహిళలు మంగళహారతులు పట్టారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. కోవూరులో అట్టహాసంగా సాగుతున్న యాత్రను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. తప్పెట్లు, మేళాలతో యాత్ర సాగడానికి అనుమతులు లేవని అడ్డుపడ్డారు.


Advertisement
Advertisement