బైల్స్‌కు కాంస్యం

ABN , First Publish Date - 2021-08-04T09:18:16+05:30 IST

జిమ్నాస్టిక్స్‌లో గంపెడు ఆశలతో బరిలోకి దిగిన అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్లో చైనా జిమ్నా స్ట్‌లు...

బైల్స్‌కు కాంస్యం

జిమ్నాస్టిక్స్‌లో గంపెడు ఆశలతో బరిలోకి దిగిన అమెరికా స్టార్‌ జిమ్నాస్ట్‌ సిమోన్‌ బైల్స్‌ కాంస్యంతో సరిపెట్టుకుంది. మహిళల బ్యాలెన్స్‌ బీమ్‌ ఫైనల్లో చైనా జిమ్నా స్ట్‌లు గాన్‌ చెన్‌చెన్‌ పసిడి (14.633), టాంగ్‌ జింగ్‌ (14.233) రజతం సాధించారు. 14 పాయింట్లు మాత్రమే స్కోరు చేసిన బైల్స్‌ మూడో స్థానానికి పరిమితమైంది. పురుషుల ప్యార్లల్‌ బార్‌ ఫైనల్‌లో డ్రాగన్‌ దేశానికే చెందిన జౌ జింగియన్‌ విజేతగా నిలవగా హారిజాంటల్‌ బార్‌ ఫైనల్లో ఆతిథ్య దేశ అథ్లెట్‌ హషిమోటో స్వర్ణం సాధించాడు.


Updated Date - 2021-08-04T09:18:16+05:30 IST