కరోనా పరీక్షలకు ‘స్వాబ్‌బోట్‌’.. సింగపూర్‌ శాస్త్రవేత్తల ఘనత !

ABN , First Publish Date - 2020-09-22T16:17:59+05:30 IST

మానవ రహిత కరోనా పరీక్షల దిశగా సింగపూర్‌ శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు.

కరోనా పరీక్షలకు ‘స్వాబ్‌బోట్‌’.. సింగపూర్‌ శాస్త్రవేత్తల ఘనత !

సింగపూర్‌ శాస్త్రవేత్తల తాజా ఆవిష్కరణ

సింగపూర్‌, సెప్టెంబరు 21: మానవ రహిత కరోనా పరీక్షల దిశగా సింగపూర్‌ శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చారు. బయోబూట్‌ సర్జికల్‌ సంస్థతో కలిసి నేషనల్‌ కేన్సర్‌ సెంటర్‌ సింగపూర్‌ (ఎన్‌సీసీఎస్‌), సింగపూర్‌ జనరల్‌ హాస్పిటల్‌ (ఎస్‌జీహెచ్‌)కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఇందుకోసం ఓ రోబో (స్వాబ్‌బోట్‌)ను తయారు చేశారు.   స్వీయ నియంత్రణ కలిగిన ఈ రోబో.. ఒక్కసారి పేషెంట్‌ పరీక్షకు సిద్ధం కాగానే యాక్టివేషన్‌ మోడ్‌లోకి వచ్చేస్తుంది. పేషెంట్ల నాసికా ద్వారాలకు 10 సెం.మీ. లోపల నుంచి స్వాబ్‌ తీస్తుంది.  ఈ రోబో వినియోగం ద్వారా పరీక్షల్లో వేగం పెరగడంతో పాటు ఆరోగ్య కార్యకర్తలకు కరోనా ముప్పు తప్పనుంది. 

Updated Date - 2020-09-22T16:17:59+05:30 IST