ఫ్లైయాష్‌ వినియోగంలో సింగరే ణికి జాతీయ అవార్డు

ABN , First Publish Date - 2021-04-11T08:46:07+05:30 IST

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయా్‌షను నూరు శాతం సద్వినియోగం చేసినందుకు సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా పురస్కారం దక్కింది.

ఫ్లైయాష్‌ వినియోగంలో సింగరే ణికి జాతీయ అవార్డు

హైదరాబాద్‌/కొత్తగూడెం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి వెలువడే ఫ్లైయా్‌షను నూరు శాతం సద్వినియోగం చేసినందుకు సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫ్లైయాష్‌ వినియోగ సంస్థగా పురస్కారం దక్కింది. గోవాలో రెండు రోజుల పాటు మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఫ్లైయాష్‌ వినియోగంపై జరిగిన అంతర్జాతీయ స్థాయి సదస్సు ముగింపు కార్యక్రమంలో శనివారం మిషన్‌ ఎనర్జీ ఫౌండేషన్‌ డైరెక్టర్‌ మనోజ్‌ కుమార్‌ చేతుల మీదుగా అవార్డును సింగరేణి డైరెక్టర్‌ (ఈ అండ్‌ ఎం) డి.సత్యనారాయణ రావు అందుకున్నారు. 

Updated Date - 2021-04-11T08:46:07+05:30 IST