Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 8 2021 @ 21:04PM

ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్

రంగారెడ్డి: ఓ కాంట్రాక్టర్ నుంచి 7 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సైట్ ఇంజనీర్ పట్టుబడ్డాడు. జిల్లాలోని పెద్దెమ్ముల్ మండలం మాంబా పూర్ గ్రామంలో జిల్లాపరిషత్ హైస్కూల్‌లో నాలుగు టాయిలెట్స్ రూములు కట్టడానికి శ్రీనివాస్ అనే వ్యక్తికి అధికారులు కాంట్రాక్టు ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న మూడు లక్షల బిల్లుల కోసం జిల్లా సైట్ ఇంజనీర్ వినోద్‌ను  శ్రీనివాస్ ఆశ్రయించాడు. బిల్లులను పాస్ చేయడానికి 7 వేలను వినోద్ లంచం డిమాండ్ చేసాడు. దీంతో ఏసీబీ అధికారులను శ్రీనివాస్ ఆశ్రయించాడు. లక్డికపూల్‌లోని జిల్లా కార్యాలయంలో వినోద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వినోద్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు.

Advertisement
Advertisement