Abn logo
Oct 22 2020 @ 05:48AM

16 పులిదంతాలు స్మగ్లింగ్..నలుగురి అరెస్ట్

కర్బీ అంగ్‌లాంగ్ (అసోం) : పులి దంతాలు స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు వ్యక్తులను అసోం పోలీసులు పట్టుకున్నారు. అసోం రాష్ట్రంలోని కర్బీ అంగ్ లాంగ్ జిల్లా డిఫూ పోలీసుస్టేషను పరిధిలోని బిర్లా ప్రాంతంలో నలుగురు వ్యక్తులు 16 పులి దంతాలను అక్రమంగా రవాణా చేస్తుండగా అసోం డీఎస్పీ నేతృత్వంలో పోలీసు బృందం వారిని అరెస్టు చేసింది.పోలీసులు నిందితుల నుంచి 16 పులిదంతాలను స్వాధీనం చేసుకున్నారు. పులిని ఎక్కడ చంపారు, పులి అవయవాలను స్మగ్లింగ్ ఎన్నాళ్లుగా చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement