స్మార్ట్‌ఫోన్లలో వీడియో సైజ్‌ తగ్గించొచ్చు!

ABN , First Publish Date - 2022-01-29T05:30:00+05:30 IST

ఫొటో లేదంటే ఒక డాక్యుమెంట్‌ సైజ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంప్రస్‌ లేదంటే జిప్‌ చేసి మెయిల్‌ ద్వారా పంపడం మనకు తెలిసిందే. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వీడియోల సైజ్‌ను తగ్గించుకోవచ్చు....

స్మార్ట్‌ఫోన్లలో  వీడియో సైజ్‌ తగ్గించొచ్చు!

ఫొటో లేదంటే ఒక డాక్యుమెంట్‌ సైజ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కంప్రస్‌  లేదంటే జిప్‌ చేసి మెయిల్‌ ద్వారా పంపడం మనకు తెలిసిందే. అదేవిధంగా ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వీడియోల సైజ్‌ను తగ్గించుకోవచ్చు. విషయానికి వస్తే,  ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత ఫలితంగా స్మార్ట్‌ఫోన్లతో ప్రభావపూరిత పనులు చేసుకునే వెసులుబాటు లభిస్తోంది.  మోడ్రన్‌ స్మార్ట్‌ఫోన్లలో 8కె వీడియోలను సైతం రికార్డు చేయవచ్చు. అయితే స్టోరేజీ సమస్య తలెత్తుతోంది.

ఉదాహరణకు 30 సెకెండ్ల వీడియో ఫుల్‌ హెచ్‌డిలో 50 ఎంబి ఫుల్‌ సైజ్‌ అవుతుంది. 4కె రిజల్యూషన్‌ అయితే 130 ఎంబి. 8కె వీడియో రమారమి 300 ఎంబి అవుతుంది. నిజానికి సైజ్‌ పెరిగితే, షేర్‌ చేయడం కూడా కష్టమే. అయితే ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనే రెండు పద్ధతుల్లో వీడియోను కంప్రెస్‌ చేయవచ్చు. మొదటి పద్ధతిలో హెచ్‌డి లేదంటే ఎఫ్‌హెచ్‌డితో రిజల్యూషన్‌ సైజ్‌ను గణనీయంగా తగ్గించవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రిజల్యూషన్‌ తగ్గింపునకు తగ్గట్టు క్వాలిటీలోనూ తగ్గుదల కనిపిస్తుంది. ఈ రెంటి మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. అందుకని నిపుణులు ఎఫ్‌హెచ్‌డిని సూచిస్తారు. 


రెండోది హై ఎఫిసియెన్సీ లేదంటే హెచ్‌ఇవిసి ఫార్మేట్‌. ఎఫ్‌హెచ్‌డి చాలా వరకు అవసరాలను తీరుస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో సైజ్‌ తగ్గింపు విషయంలో రాజీపడటం కుదరదు. అక్కడ  హెచ్‌ఇవిసి ఉపయోగపడుతుంది. హై ఎఫిసియెన్సీ వీడియో కోడ్‌ దీని పూర్తి రూపం. సాధారణంగా హెచ్‌ 265 అంటారు. ఈ పద్ధతిలో వీడియో క్వాలిటీ, రిజల్యూషన్‌ దెబ్బతినవు. దాదాపుగా అన్ని ప్రీమియం స్మార్ట్‌ ఫోన్లలోని కెమెరా సెట్టింగ్స్‌లో  వీడియో ఎన్‌కోడింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఆ మోడ్‌లోకి వెళితే చాలు, వీడియో సైజ్‌ను అదే తగ్గిస్తుంది. రెగ్యులర్‌ హెచ్‌.264తో కంపాటిబిలిటీ మాత్రం ఉండదు. దాంతో వీటిని ప్లే చేసేందుకు అదనపు వీడియో ప్లేయర్‌ అవసరమవుతుంది. 


చివరిగా మూడో పద్ధతి. ఇన్‌-బిల్ట్‌, మూడో పార్టీ యాప్‌నూ ఇందులో ఉపయోగిస్తారు. స్మార్ట్‌ ఫోన్లలో చాలా వరకు బేసిక్‌ ఎడిటింగ్‌ టూల్స్‌ ఉంటాయి. మొదటి రెండో పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఫీచర్‌ తక్కువగా ఉంటే ఆ ప్రభావం రిజల్యూషన్‌పై కూడా ఉంటుంది. కైన్‌మాస్టర్‌, అడోబ్‌ రష్‌, పవర్‌ డైరెక్టర్‌ వంటి మూడో పార్టీ యాప్‌లతోనూ వీడియోలను కంప్రెస్‌ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-01-29T05:30:00+05:30 IST