సోమశిల, కండలేరు డ్యామ్ సమాచారం

ABN , First Publish Date - 2020-09-25T14:35:37+05:30 IST

జిల్లాలోని సోమశిల, కండలేరు డ్యామ్‌లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.

సోమశిల, కండలేరు డ్యామ్ సమాచారం

నెల్లూరు: జిల్లాలోని సోమశిల, కండలేరు డ్యామ్‌లకు వరద ప్రవాహం కొనసాగుతోంది.  సోమశిల డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 74.021 టీఎంసీలుగా ఉంది. అలాగే ఇన్ ఫ్లో 11,989 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 50 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే  కండలేరు డ్యామ్ పూర్తి నీటి సామర్థ్యం 68.03 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 43.830 టీఎంసీలుగా ఉంది. ప్రస్తుతం డ్యామ్ ఇన్ ఫ్లో 10,328క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1620 క్యూసెక్కులకు చేరింది. 

Updated Date - 2020-09-25T14:35:37+05:30 IST