Abn logo
Apr 21 2021 @ 12:11PM

నెల్లూరులోనే ఎక్కువగా కేసులు.. చర్యలు చేపట్టండి: సోమిరెడ్డి

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో కరోనా కల్లోలంపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోనే ఎక్కువ కోవిడ్ కేసులు నెల్లూరులోనే నమోదవుతున్నాయని సోమిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. పరిస్థితి చేయి దాటి పోకుండా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. నెల్లూరు జీజీహెచ్‌లో ఉన్న అన్ని బెడ్లపై వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీజీహెచ్‌లో ఖాళీగా ఉన్న వెంటిలేటర్లను తాత్కాలికంగా ప్రైవేటు ఆస్పత్రులకు పంపి ఉచితంగా వైద్యసేవలు అందించాలని సోమిరెడ్డి కోరారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా అవసరమైన సిబ్బందిని వెంటనే నియమించుకోవాలన్నారు. నెల్లూరులో మెరుగైన వైద్య సేవలు అందక చెన్నైకి వెళ్లి లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అప్పులపాలవుతున్నారన్నారు. హెల్త్ మినిస్టర్ నేతృత్వంలో ఓ కమిటీని వెంటనే నెల్లూరుకు పంపి పరిస్థితులను చక్కదిద్దాలని సోమిరెడ్డి లేఖలో కోరారు.


Advertisement
Advertisement
Advertisement