త్వరలోనే టీ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక
ABN , First Publish Date - 2021-07-11T01:40:28+05:30 IST
త్వరలోనే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ నాయకడు
హైదరాబాద్: త్వరలోనే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ నాయకడు నన్నూరి నర్సిరెడ్డి తెలిపారు. టీ-టీడీపీ అధ్యక్షుడి ఎంపిక బాధ్యత చంద్రబాబుదేనని ఆయన పేర్కొన్నారు. ఎల్. రమణ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు టీడీపీ నాయకులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. రేపు ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు, అనుబంధ సంఘాలతో సమావేశం ఉంటుందన్నారు. త్వరలోనే నూతన అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందన్నారు. మండలాలు, జిల్లాలు, నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటు చేసి నాయకులను తయారు చేసిన చరిత్ర టీడీపీదని నర్సిరెడ్డి తెలిపారు.