Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీలంకను 142 పరుగులకు కట్టడి చేసిన దక్షిణాఫ్రికా

షార్జా: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో142 పరుగులకు ఆలౌట్ అయింది. తబ్రైజ్ షంషీ, డ్వైన్ ప్రిటోరియస్ బౌలింగ్ దాడిని ఎదుర్కొని నిలబడిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిశంక  58 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 72 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


ఆ తర్వాత చరిత్ అసలంక చేసిన 21 పరుగులే అత్యధికం. కెప్టెన్ దాసున్ షనక 11 పరుగులు చేశాడు. మిగతా వారిలో ఎవరూ రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. 8 మంది కలిసి చేసిన మొత్తం పరుగులు 29 మాత్రమే కావడం గమనార్హం. సఫారీ బౌలర్లలో షంషీ, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీసుకోగా, అన్రిక్ నార్జ్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement