బాలు మాటిచ్చారు..నిలుపుకొన్నారు

ABN , First Publish Date - 2020-09-26T12:09:30+05:30 IST

రోనా విపత్కర పరిస్థితులు అధిగమించగానే.. మీ కోరిక మన్నించి అమలాపురంలో జరిగే మనసు కవి ఆత్రేయ పాటల

బాలు మాటిచ్చారు..నిలుపుకొన్నారు

తెలుగు సినీగేయకవుల చరిత్ర గ్రంథాన్ని ఆయనే అచ్చు వేయించారు

ఆత్రేయ పాటలు కూడా ముద్రించమన్నారు.. పుస్తకావిష్కరణకు వస్తానన్నారు 

అంతలోనే ఇలా జరగడం దురదృష్టకరం: డాక్టర్‌ పైడిపాల 


అమలాపురం: కరోనా విపత్కర పరిస్థితులు అధిగమించగానే.. మీ కోరిక మన్నించి అమలాపురంలో జరిగే మనసు కవి ఆత్రేయ పాటల పుస్తకావిష్కరణ సభకు వస్తానని ‘బాలు’ మా టిచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే గొప్ప వ్యక్తిత్వ మున్న మహనీయుడాయన. తన గానామృతంతో సమ్మోహితులను చేసే గానగంధర్వుడు మాకిచ్చిన మాటను గుర్తించారో ఏమోగానీ గంధర్వులు ముందుగానే బాలును తమ లోకానికి తీసుకుపోయి సంగీత కళాభిమానులందరినీ కన్నీటి సంద్రంలో ముంచేశారని అమలాపురం పట్టణానికి చెందిన ప్రముఖ గ్రంథ రచయిత డాక్టర్‌ పైడిపాల గద్గద స్వరంతో అన్నారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని డాక్టర్‌ పైడిపాల వివరించారు.


రెండు గ్రంథాలను వెలుగులోకి తెచ్చి..

బాలుతో 35ఏళ్ల అనుబంధం ఉంది. తెలుగు సినిమా పాట చరి త్రపై పరిశోధన చేసేందుకు మద్రాసు విశ్వవిద్యాలయానికి వెళ్లినప్పుడు 1990లో బాలుకి బాగా దగ్గరయ్యాను. ఆ పుస్తకాన్ని తానే స్పా న్సర్‌ చేసి ప్రచురిస్తానని ఆ రోజే ముందుకువచ్చి మాట నిలుపు కున్నారు. స్నేహ ప్రచురణల పేరిట నేను రచించిన గ్రంథాలను ఆయనే అచ్చు వేయించారు. తెలుగు సినీగేయకవుల చరిత్ర గ్రంథా న్ని బాలుకు ఆనాడే అంకితం చేశా. తెలుగు సినిమాల్లో డబ్బిం గ్‌ పాటలు అనే పుస్తకాన్ని రచించి 2010లో ఆవిష్కరణ సభ ఏర్పాటు చేయగా బాలు ముఖ్యఅతిథిగా హాజరై ఆ పుస్తకం ప్రథమ పేజీలో బాలు, కమలహాసన్‌ ముఖచిత్రాలను గుర్తించి సంగీతానికి, సాహిత్యానికి, నృత్యానికి ప్రాధాన్యమిచ్చావంటూ కొనియాడారు.


అమలాపురం వస్తానన్నారు..

2018లో పాడుతా తీయగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బాలు పిలిచారు. ఆ కార్యక్రమానికి సలహాలు, సూచనలు చేస్తే పెద్దమ నసుతో స్వీకరించారు. నవరసాల్లో శోకరసం అనేది ఉండదని అప్పు డే చెప్పా. ఆ సమయంలోనే మనసు కవి ఆత్రేయ సినిమా పాటలను పునర్‌ముద్రించేందుకు పూనుకోమ్మని అందుకు అవసరమైన సహాయం చేస్తానని ముందుకు వచ్చిన దానశీలి బాలు. ఆయన సూచన ల మేరకు ఆత్రేయ రచించిన 1600 పాటలను సేకరించి వాటిని రెండు భాగాలుగా ప్రచురించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నాం. త్వర లోనే ఆత్రేయ పాటల గ్రంథాలను ఆవిష్కరించేందుకు అమలాపురం వస్తానని బాలు మాటిచ్చారు. ఆ కార్య క్రమం జరగకుండానే ఆయన దివంగతులు కావడం దురదృష్టం.


ద్రాక్షారామ భీమేశ్వరునికి బాలు స్వరార్చన

ద్రాక్షారామ: బాలసుబ్రహ్మణ్యానికి ద్రాక్షారామతో ప్రత్యేక అను బంధం ఉంది. ఇక్కడ ప్రసన్నాంజనేయ బాలభక్త సమాజం ఆధ్వర్యంలో 2005, నవంబరు 29న జరిగిన కార్తీక దీపారాధన మహోత్సవంలో ఆయన తన స్వర మాఽదుర్యంతో అలరించారు. బాలు సరస్వతీపుత్రుడంటూ బోస్‌ కొనియాడారు. ఆయన స్థానం భర్తీ చేయలేని దని ప్రసన్నాంజనేయ భాలభక్త సమాజం మాజీ అధ్యక్షుడు దామిశెట్టి గంగాపురుషోత్తం, ద్రాక్షారామ నాటక కళాపరిషత్‌ అధ్యక్షుడు నాగిరెడ్డి సతీష్‌రావు, కార్యదర్శి, సినీ నటి ద్రాక్షారామ సరోజ వాటర్‌ క్లబ్‌ అధ్యక్షుడు మేడపాటి సుబ్బారెడ్డి, సిరివెన్న ల సహ నిర్మా త ఉజూరి వీర్రాజు పేర్కొన్నారు.


యానాంతో ప్రత్యేక అనుబంధం

యానాం: గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి యానాంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రి మల్లాడితో మంచి స్నేహ సంబంధం ఉంది. పాడాలని ఉంది.. తొలి ఎపిసోడ్‌ ఫైనల్‌ షో యానాంలోని జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో జరిగింది. యానాం ప్రజా ఉత్సవాలు కూడా అప్పుడే (2002) ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లోనే ఈ షో ర్వహించడంతోపాటు అ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా, వ్యాఖ్యాతగా బాలు వ్యవహరించారు. అప్పటినుంచి మంత్రి మల్లాడితో అనుబంధం కొనసాగుతోంది. యానాం ప్రజా ఉత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది వివిధ రంగాల్లో ప్రముఖులను గౌరవంగా సత్కరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో 2018లో సినీ రంగ ప్రముఖుడైన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని యానాం ప్రజల తరుపున సీఎం వి.నారాయణసామి, ఆరోగ్యశాఖమంత్రి మల్లాడి కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఎస్పీబాలుతోపాటు అదేరోజు కేంద్రీయ హిందీ సమితి సభ్యులు డాక్టర్‌ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాస్‌, ఘంటసాల కోడలు పార్వతిరవి ఘంటసాల, డైరెక్టర్‌ సుకుమార్‌, ప్రముఖ కవి కర్రి సంజీవరావు(శిఖామణి) తదితరులను సత్కరించారు.

Updated Date - 2020-09-26T12:09:30+05:30 IST