ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్ హాక్‌

ABN , First Publish Date - 2020-09-19T00:18:38+05:30 IST

ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబర్ నేరస్తులు హాక్‌ చేశారు...

ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్ హాక్‌

నల్లగొండ: ఎస్పీ రంగనాథ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ను సైబర్ నేరస్తులు హాక్‌ చేశారు. ఎస్పీ పేరుతో పలువురిని డబ్బులు అడిగి ఆయన భార్య అకౌంట్‌కు డబ్బులు పంపాలంటూ పలువురికి మెస్సేజ్‌లు పంపారు. ఒడిశాకు చెందిన అనిత పేరుతో గూగుల్‌పే, ఫోన్‌పే నెంబర్లను పంపించారు. డబ్బులు అకౌంట్లో వేసి స్క్రీన్‌షాట్‌ పంపాలంటూ పలువురితో చాటింగ్‌ చేశారు. ఈ విషయమై ఎస్పీ రంగనాథ్‌ మాట్లాడుతూ ఎవరూ తన అకౌంట్‌కు డబ్బులు పంపొద్దని తెలిపారు. రెండు సంవత్సరాలుగా తన ఫేస్‌బుక్ అకౌంట్‌ వాడడం లేదని, ఎవరూ డబ్బులు పంపొద్దని.. అది తన అకౌంట్‌ కాదని ఎస్పీ రంగనాథ్‌ వివరణ ఇచ్చారు.

Updated Date - 2020-09-19T00:18:38+05:30 IST