Abn logo
Jun 10 2021 @ 04:52AM

నడాల్‌ జోరు

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌ 

స్పెయిన్‌ బుల్‌ నడాల్‌ జోరు కొనసాగుతోంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో నడాల్‌ 6-3, 4-6, 6-4, 6-0 తో 10వ సీడ్‌ డిగో ష్వార్జ్‌మన్‌ (అర్జెంటీనా)పై నెగ్గాడు. మ్యాచ్‌ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన నడాల్‌ 6-3తో తొలిసెట్‌ను సొంతం చేసుకొన్నాడు. అయితే, రెండో సెట్‌లో సత్తాచాటిన షార్జ్‌మన్‌ 6-4తో నెగ్గి రఫాకు సవాల్‌ విసిరాడు. మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టుగా తలపడినా.. 4-4తో ఉన్న సమయంలో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన నడాల్‌ 6-4తో గెలిచాడు. ఇక నాలుగో సెట్‌లో దూకుడుగా ఆడిన రఫా 6-0తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఇక ప్రపంచ రెండో ర్యాంకర్‌ డానిల్‌ మెద్వెదెవ్‌తో పోరులో గ్రీకు వీరుడు సిట్సిపాస్‌ వరుస సెట్లలో నెగ్గి సెమీ్‌సకు చేరుకున్నాడు. సిట్సిపాస్‌ 6-3, 7-6(3), 7-5తో రష్యా ఆటగాడు మెద్వెదెవ్‌ను ఓడించాడు. సెమీ్‌సలో జర్మన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో సిట్సిపాస్‌ తలపడనున్నాడు. 


Advertisement
Advertisement
Advertisement