తెలంగాణలో జరుగుతున్నంత పురోగతి ఏ రాష్ట్రంలో జరగడం లేదు

ABN , First Publish Date - 2021-10-03T00:23:34+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నంత పురోగతి ఏరాష్ట్రంలో జరగడం లేదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

తెలంగాణలో జరుగుతున్నంత పురోగతి ఏ రాష్ట్రంలో జరగడం లేదు

కామారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నంత పురోగతి ఏరాష్ట్రంలో జరగడం లేదని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు దాదాపు రూ.350కోట్ల ఖర్చుతో బతుకమ్మ చీరల పంపిణి జరుగుతోందని తెలిపారు. శనివారం ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలోని గాంధారి మండల కేంద్రంలో, బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగన కార్యక్రమంలో ఆడపడుచులకు "బతుకమ్మ చీరల పంపిణీ" కార్యక్రమాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు. 


ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మహిళలకు అన్నగా ప్రతి ఏడాది  బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు చీరలను అందిస్తున్నారని తెలిపారు. ఇది ప్రేమతో పెడుతున్న కానుక, దీనికి ధర లేదని అన్నారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఈ చీరలు అందుతాయని అన్నారు.బతుకమ్మ పండుగకు ఆడపడుచులకు చీరల పంపిణీ, రంజాన్ పండుగకు ముస్లిం సోదరులకు‌, క్రిస్మస్ కు క్రిస్టియన్ సోదరులకు బట్టలను పంపిణీ చేస్తున్నఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.


రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 లక్షల మందికి కల్యాణలక్ష్మీ, షాదీమూబారక్ అందించారు.మిషన్ భగీరధ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఇంటింటికీ త్రాగునీరు అందుతోందని స్పీకర్ వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బాన్సువాడ నియోజకవర్గానికి అత్యధికంగా పదివేల డబుల్ బెడ్ రూం ఇళ్ళను మంజూరు చేశారు. అయిదువేల ఇళ్ళ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని స్పీకర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-10-03T00:23:34+05:30 IST