తుక్కుగూడ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు

ABN , First Publish Date - 2021-10-22T05:06:01+05:30 IST

నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల అభివృద్ధికి

తుక్కుగూడ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు
మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

మహేశ్వరం : నూతనంగా ఏర్పాటైన మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక నిధులు విడుదల చేస్తూ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారని విద్యాశాఖమంత్రి పి.సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధిపై గురువారం హైదరాబాదులోని మంత్రి కార్యాలయంలో కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌తోపాటు ఇతర ఇంజనీరింగ్‌ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ వివిధ అభివృద్ధి పనులకోసం తుక్కుగూడ మున్సిపాలిటీకి రూ.7కోట్ల 65లక్షల ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. తుక్కుగూడ మున్సిపాలిటీలోని శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి వివేకానంద విగ్రహం దారి నుంచి సర్దార్‌నగర్‌ వరకు బీటీరోడ్డు పనులకు రూ.2కోట్ల 25లక్షలు, రావిరాల నుంచి ఆర్‌సీఐ వరకు రూ.4 కోట్లు, మంఖాల్‌గుడి కమాన్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్లు వరకు 50 లక్షలతో బీటీ రోడ్డు పనులతో పాటు సూరం చెరువు అభివృద్ధికి కూడా నిధులు మంజూరయ్యాయన్నారు. త్వరగా టెండర్‌ ప్రక్రియను ప్రారంభించి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 



Updated Date - 2021-10-22T05:06:01+05:30 IST