రాబంధుల్లా అంబులెన్సుల నిర్వాహకులు..ఈ విపత్కర పరిస్థితుల్లో..

ABN , First Publish Date - 2020-08-11T00:12:20+05:30 IST

కరోనా ఎన్నో కుటుంబాలను దిక్కులేని వారిని చేస్తోంది.. కాస్త అనారోగ్యం అనిపించినా వైద్యుల సేవల కోసం ఆస్పత్రులకు..

రాబంధుల్లా అంబులెన్సుల నిర్వాహకులు..ఈ విపత్కర పరిస్థితుల్లో..

కరోనా ఎన్నో కుటుంబాలను దిక్కులేని వారిని చేస్తోంది.. కాస్త అనారోగ్యం అనిపించినా వైద్యుల సేవల కోసం ఆస్పత్రులకు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా అంబులెన్సుల నిర్వాహకులు మానవత్వం మరిచి రాబంధుల్లాగా మారిపోతున్నారు. సాటి మనిషికి సాయం చేయాల్సిన ఈ విపత్కర పరిస్థితుల్లో కాసులకే ప్రాధాన్యమిస్తూ కాల్చుకుతింటున్నారు. 


గతంలో రోడ్డు మీద కుయ్ కుయ్ అనే సౌండ్‌తో అంబులెన్స్ వెళుతుంటే పాపం ఎవరో అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని అందరూ అనుకునే వారు. కానీ ఇప్పుడు ప్రకాశం జిల్లాలో అంబులెన్స్ పేరెత్తినా.. చూసినా సౌండ్ విన్నా జనాలు హడలిపోతున్నారు. జిల్లాలో ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల తీరు వివాదాస్పదంగా మారింది. కరోనా కారణంగా ఎవరు ఎవరినీ ముట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది. మనిషి అపాయంలో ఉన్నాడంటే సహాయం చేయాలనే తపన ఉన్నా ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దీనినే అదనుగా మలుచుకుంటున్న పరిస్థితి ఏర్పడింది. కరోనా కష్టకాలాన్ని కొందరు ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకులు ఆదాయ వనరులుగా మలుచుకుంటున్నారు. గ్రామాల నుంచి, ఇళ్ల నుంచి ఆస్పత్రులకు పేషెంట్లను తరలించాలంటే వేలకు వేలు డిమాండ్ చేస్తున్నారు. దూరంతో, కిలో మీటర్లతో సంబంధం లేకుండా డబ్బులు వసూలు చేస్తున్నారు. 


Updated Date - 2020-08-11T00:12:20+05:30 IST