కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

ABN , First Publish Date - 2020-07-08T02:51:40+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు 13 జిల్లాల్లో ...

కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నానాటికి పెరుగుతున్న నేపథ్యంలో జైళ్లలో ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు 13 జిల్లాల్లో స్పెషల్ సబ్ జైళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 13 ప్రత్యేక జైళ్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై నేరస్తులందరినీ కోర్టు ఆదేశాల అనంతరం స్పెషల్ జైలుకు తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో అధికారులను ఆదేశించారు. ఈ సబ్ జైళ్లలో కరోనా టెస్టులు, ఇతర శానిటైజేషన్ ప్రోటోకాల్‌ను పాటించాలని సూచించారు. కరోనా నెగిటీవ్ ఖైదీలను మాత్రమే సాధారణ జైలుకు తరలించాలని పేర్కొన్నారు. స్పెషల్ సబ్ జైళ్ల సిబ్బందికి ప్రత్యేక రక్షణ కిట్లు అందివ్వనున్నారు. ప్రత్యేక జైలు నుంచి ఖైదీలు పారిపోకుండా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. పాజిటివ్ వ్యక్తులను వెంటనే కోవిడ్ ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జైళ్లలో టెస్టులు చేసేందుకు ఒక మెడికల్ అధికారితో పాటు పారా మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Updated Date - 2020-07-08T02:51:40+05:30 IST