మార్చి 1 నుంచి స్పెక్ట్రమ్‌ వేలం

ABN , First Publish Date - 2021-01-07T07:06:34+05:30 IST

ఆరో విడత స్పెక్ట్రమ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 3జీ, 4జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రమ్‌ వేలం వేయనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. టెలికాం శాఖ

మార్చి 1 నుంచి స్పెక్ట్రమ్‌ వేలం

  • రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం
  • జు ఫిబ్రవరి 5 వరకు బిడ్స్‌ స్వీకరణ


న్యూఢిల్లీ: ఆరో విడత స్పెక్ట్రమ్‌ వేలానికి రంగం సిద్ధమైంది. మార్చి 1 నుంచి 3జీ, 4జీ సేవలకు ఉపయోగపడే స్పెక్ట్రమ్‌ వేలం వేయనున్నట్టు ప్రభు త్వం ప్రకటించింది. టెలికాం శాఖ (డాట్‌) ఇందుకు సంబంధించి బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆస క్తి ఉన్న టెలికాం ఆపరేటర్లు ఫిబ్రవరి 5లోగా బిడ్స్‌ సమర్పించాలి. ట్రాయ్‌  కనీస  ధర ప్రకారం  ఈ వేలం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3.92 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం మళ్లీ స్పెక్ట్రమ్‌ను వేలం వేస్తోంది. దీంతో మరింత స్పెక్ట్రమ్‌ అందుబాటులోకి వచ్చి దేశంలో టెలికాం సేవల నాణ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 


5జీ స్పెక్ట్రమ్‌ వేలం ఇపుడే కాదు:

మార్చి 1 నుంచి జరిగే స్పెక్ట్రమ్‌ వేలం నుంచి 3,300-3,600 మెగాహెడ్జ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ స్పెకా్ట్రన్ని మినహాయించారు. ఈ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ను 5జీ టెలికాం సేవలకు ఉపయోగిస్తారు. దీంతో దేశంలో 5జీ సేవల ప్రారంభం మరింత ఆలస్యమవుతుందని భావిస్తున్నారు. మార్చి 1 నుంచి జరిగే వేలంలో 700, 800, 900, 2100, 2300, 2500 మెగాహెడ్జ్‌ స్పెక్ట్రమ్‌ను మాత్రమే వేలం వేస్తారు. ఇందులో 700 మెగాహెడ్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌కు అత్యధిక ధర పలుకుతుందని భావిస్తున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని సర్కిల్స్‌లో ఈ స్పెక్ట్రమ్‌ కావాలనుకునే ఆపరేటర్లు ఎంత లేదన్నా రూ.32,905 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. 


 వొడాఫోన్‌ ఐడియా పాల్గొనడం డౌటే !

అన్ని సర్కిల్స్‌లో 3జీ, 4జీ స్పెక్ట్రమ్‌ కోసం  కంపెనీలు ఎంత లేదన్నా రూ.55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుం ది. వొడాఫోన్‌ ఐడియా ఇప్పటికీ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ కంపెనీ, ఈ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనక పోవచ్చని భావిస్తున్నారు. కొన్ని సర్కిల్స్‌లో ఉన్న స్పెక్ట్రమ్‌ పునరుద్ధరణకు కూడా వొడాఫోన్‌ ఐడియా ముందుకు రాక పోవచ్చని అంచనా. దీంతో ఈ సారి జరిగే స్పెక్ట్రమ్‌ వేలం రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌కే పరిమితం కానుంది. 


Updated Date - 2021-01-07T07:06:34+05:30 IST