ఇతర మార్గాలు వెతుకుదాం

ABN , First Publish Date - 2020-05-24T08:20:30+05:30 IST

ఇతర మార్గాలు వెతుకుదాం

ఇతర మార్గాలు వెతుకుదాం

లండన్‌: క్రికెట్‌ బంతికి ఉమ్మి పూయకుండా ఐసీసీ నిషేధం విధించింది. అయితే, అదేమీ పెద్ద సమస్య కాదని ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ అన్నాడు. బంతిని షైన్‌ చేయడానికి బౌలర్లు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతారని చెప్పాడు. బంతికి ఉమ్మి పూయడం ఒక అలవాటుగా మారిందన్నాడు. దాన్ని దూరం చేసుకోవడానికి కొంత ప్రాక్టీస్‌ అవసరమని వోక్స్‌ పేర్కొన్నాడు. ఏదో విధంగా బంతిని మెరిపించే ప్రయత్నమైతే చేస్తామన్నాడు. కాగా, బంతికి ఉమ్మి పూయకుండా ఉండాలనే నిబంధనను అమలు చేయడం ఎంతో కష్టమని ఆస్ట్రేలియా మాజీ పేసర్‌ బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ‘ఎన్నో ఏళ్లుగా బౌలర్లు ఉమ్మిని పూస్తున్నారు. ఇప్పటికిప్పుడు దాన్ని మార్చుకోవడం కష్టమే’ అని అన్నాడు. లీ అభిప్రాయంతో దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసి ఏకీభవించాడు. ఫీల్డింగ్‌ సమయంలో కూడా స్లిప్‌లో క్యాచ్‌లు అందుకునేటప్పుడు చేతులను ఉమ్మితో తడి చేసుకుంటారని డుప్లెసి చెప్పాడు. 

Updated Date - 2020-05-24T08:20:30+05:30 IST