లా లిగాకు గ్రీన్‌సిగ్నల్‌

ABN , First Publish Date - 2020-05-24T08:17:22+05:30 IST

లా లిగాకు గ్రీన్‌సిగ్నల్‌

లా లిగాకు గ్రీన్‌సిగ్నల్‌

మాడ్రిడ్‌: నిన్న బుండెస్లిగా.. ఇప్పుడు లా లిగా. ఇలా ప్రతిష్ఠాత్మకమైన లీగ్‌ల నిర్వహణతో ఫుట్‌బాల్‌ మళ్లీ పట్టాలెక్కుతోంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ లా లిగా పోటీలను వచ్చేనెల 8 నుంచి నిర్వహించుకోవచ్చని స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌ శనివారం ప్రకటించారు. ‘మేజర్‌ ప్రొఫెషనల్‌ క్రీడా పోటీలు.. ప్రధానంగా లా లిగాను జూన్‌ రెండోవారం నుంచి ఆడేందుకు అనుమతిస్తున్నాం’ అని శాంచెజ్‌ తెలిపారు. బుండెస్లిగా పోటీలు గతవారం మొదలైన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-05-24T08:17:22+05:30 IST