కంప్యూటర్ల రాకతో చెస్‌ గేమ్‌ మారింది

ABN , First Publish Date - 2020-05-24T08:19:35+05:30 IST

కంప్యూటర్ల రాకతో చెస్‌ గేమ్‌ మారింది

కంప్యూటర్ల రాకతో చెస్‌ గేమ్‌ మారింది

ముంబై: కంప్యూటర్ల రాకతో చెస్‌ ఆడే తీరే మారిపోయిందని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. ‘80వ దశకంలో నేను నేర్చుకున్న ఆటకు ఇప్పటి ఆటకు ఎంతో తేడా ఉంది. కంప్యూటర్ల రాకతో చెస్‌ ముఖచిత్రమే మారిపోయిది. బోర్డు ముందు ఎదురెదురుగా ఇద్దరు ఆటగాళ్లు కూర్చొని ఆడడం ఒక్కటే మారలేదు’ అని శనివారం మైండ్‌ మాస్టర్స్‌ షో సందర్భంగా ఆనంద్‌ తెలిపాడు. ఇక.. చెస్‌లో తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని తెలిపాడు. ‘నాకు ఆరేళ్లప్పుడు అన్న, అక్క చెస్‌ ఆడుతుంటే నాక్కూడా నేర్పాలని అమ్మను బలవంతపెట్టే వాడిని. ఒక్కరోజులోనే పెద్ద ఆటగాడిని అయిపోలేదు. దీనివెనక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది’ అని విషీ చెప్పాడు. కాగా.. ప్రతీ గేమ్‌ తర్వాత ఒత్తిడిని దూరం చేసుకోవడానికి తాను జిమ్‌కు వెళ్తానని అన్నాడు. 

Updated Date - 2020-05-24T08:19:35+05:30 IST