మూడో దశ పరీక్షలకు స్పుత్నిక్‌

ABN , First Publish Date - 2021-01-12T09:08:46+05:30 IST

రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీపై డాక్టర్‌ రెడ్డీస్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించబోతోంది.

మూడో దశ పరీక్షలకు స్పుత్నిక్‌

ఆమోదం తెలిపిన డీఎ్‌సఎంబీ


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీపై డాక్టర్‌ రెడ్డీస్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ప్రారంభించబోతోంది. వ్యాక్సిన్‌పై నిర్వహించిన రెండో దశ పరీక్షల భద్రత డేటాను స్వతంత్ర డేటా అండ్‌ సేఫ్టీ మానిటరింగ్‌ బోర్డు (డీఎ్‌సఎంబీ) సమీక్షించిందని, మూడో దశ పరీక్షలు చేపట్టడానికి అనుమతి ఇచ్చిందని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ వెల్లడించింది. మూడో దశ పరీక్షలకు వాలెంటీర్లను నియమించుకోవాల్సిందిగా సూచించినట్లు తెలిపింది. గతంలో ఆమోదించిన క్లినికల్‌ పరీక్షల ప్రతిపాదనలకు ఎటువంటి మార్పులు కూడా చేయలేదని పేర్కొంది. 


డీఎ్‌సఎంబీ పచ్చజెండా ఊపిన నేపథ్యంలో సేఫ్టీ డేటాను డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ)కి సమర్పించాల్సి ఉంటుంది. ఈ డేటాను డీసీజీఐ సమీక్షిస్తుంది. మూడో దశ పరీక్షలకు ఆమోదం తెలుపుతుంది. కాగా  క్లినికల్‌ పరీక్షల నిర్వహణకు జేఎ్‌సఎస్‌ మెడికల్‌ రీసెర్చ్‌ను క్లినికల్‌ భాగస్వామిగా డాక్టర్‌ రెడ్డీస్‌ నియమించింది.

Updated Date - 2021-01-12T09:08:46+05:30 IST