క్రికెట్‌కు ఉడాన గుడ్‌బై

ABN , First Publish Date - 2021-08-01T09:21:00+05:30 IST

శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఇసురు ఉడాన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2012లో స్వదేశంలో భారత్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఉడాన కెరీర్‌లో...

క్రికెట్‌కు ఉడాన గుడ్‌బై

కొలంబో: శ్రీలంక ఆల్‌రౌండర్‌ ఇసురు ఉడాన అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. 2012లో స్వదేశంలో భారత్‌పై వన్డే అరంగేట్రం చేసిన ఉడాన కెరీర్‌లో 21 మ్యాచుల్లో 237 రన్స్‌ చేసి 18 వికెట్లు తీశాడు. 35 టీ20ల్లో 256 పరుగులు చేసి 27 వికెట్లు దక్కించుకొన్నాడు. ఇక ఐపీఎల్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్‌ ప్రకటించినా దేశవాళీ క్రికెట్‌లో కొనసాగనున్నట్టు 33 ఏళ్ల ఉడాన తెలిపాడు.

Updated Date - 2021-08-01T09:21:00+05:30 IST