శ్రీరాంసాగర్ 32 గేట్ల ఎత్తివేత
ABN , First Publish Date - 2021-09-10T01:58:27+05:30 IST
మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది
నిజామాబాద్: మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తుతుండడంతో నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు 32గేట్లు ఎత్తి.. 2లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090 అడుగుల మేర నీటి నిల్వ ఉంది. అలాగే కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్ట్ 8 గేట్లు ఎత్తి 44 వేల క్యూసెక్కుల నీటిని మంజీర నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 17 టీఎంసీల మేర నీటిమట్టం ఉంది. ఈ ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం 47 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.