Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీవీఎంసీ కమిషనర్‌గా సృజన

విశాఖ: విశాఖ నగర జీవీఎంసీ కమిషనర్‌గా సృజన తిరిగి నియమితులయ్యారు. జీవీఎంసీ కమిషనర్‌గా సృజన పదవీ బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమెను బదిలీ చేశారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి ప్రభుత్వం ఈ అవకాశం కల్పించింది. మేయర్‌, కార్పొరేటర్లు, ఇతర  అధికారులందరితో కలిసి సమర్థవంతంగా జీవీఎంసీని అభివృద్ధి చేస్తామని ఆమె పేర్కొన్నారు. 


మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎస్‌ఈసీ ఆదేశం మేరకు జీవీఎంసీ కమిషనర్‌ సృజనను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె గతంలో విశాఖలోనే జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు. 

Advertisement
Advertisement