Abn logo
Nov 25 2021 @ 03:25AM

30 నుంచి స్టార్‌ హెల్త్‌ ఐపీఓ

ఇష్యూ ధర రూ.870-900

న్యూఢిల్లీ : వచ్చే వారం మరో భారీ ఐపీఓ మార్కెట్‌కు వస్తోంది. రూ.7,249 కోట్లు సమీకరించేందుకు స్టార్‌  హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఈ నెల 30న పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. ఇందుకోసం ఒక్కో షేరు ధరను రూ.870-900గా ఖరారు చేశారు. ఈ ఇష్యూ డిసెంబరు 2న ముగుస్తుంది. ఇందులో రూ.2,000 కోట్లు కంపెనీ కొత్తగా సమీకరించబోతోంది. మిగతా మొత్తాన్ని కంపెనీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన పీఈ సంస్థలు విక్రయిస్తున్నాయి.