Abn logo
Oct 16 2021 @ 14:44PM

రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయి: రఘురామ

ఢిల్లీ: రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు మొదలయ్యాయని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు కట్టింది తక్కువ, చెప్పేది ఎక్కువ అని తప్పుబట్టారు. తన నియోజకవర్గం సమస్యలను పట్టించుకోవడం లేదు అని అంటున్నారని తెలిపారు. కరెంట్‌కు బొగ్గు ఇవ్వలేని వారు, ఆక్వాకు సీడ్, ఫీడ్ ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మందు చూపు ఉందా లేదా అని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. మందుపై ఉన్న చూపు విద్యుత్‌పై ఎందుకులేదో మనం ఆలోచన చేయాలని  రఘురామ సూచించారు.